దక్షిణ విశాఖ - South Vizag

విశాఖ: వైభవంగా ముందస్తు సంక్రాంతి వేడుకలు

విశాఖ: వైభవంగా ముందస్తు సంక్రాంతి వేడుకలు

విశాఖ దక్షిణ నియోజకవర్గ 35వ వార్డులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ముందస్తు సంక్రాంతి సంబరాలు వైభవంగా జరిగాయి. వార్డు పార్టీ అధ్యక్షులు అలుపన కనకారెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గంగిరెద్దులాట, ముగ్గుల పోటీలు, మహిళలకు కుర్చీలాట వంటి వినోద కార్యక్రమాలు నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన వారికి పట్టుచీర, కుక్కర్, గోడగడియారం వంటి బహుమతులు అందజేశారు. ఈ వేడుకలు ప్రజలలో ఉత్సాహాన్ని నింపాయి.

వీడియోలు


హైదరాబాద్