
100 కేజీల గంజాయి స్వాధీనం
విశాఖలోని ఆనందపురం పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు ఒక కారులో 100 కేజీల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. DL4CNE826 నంబర్ గల కారును తనిఖీ చేయగా, నాలుగు సంచులలో గంజాయి ఉన్నట్లు కనుగొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పోలీసులు కారును స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.







































