
విశాఖ: బీజేపీ ఫ్లోర్ లీడర్ విస్తృత పర్యటన
మంగళవారం విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ 48వ వార్డు కార్పొరేటర్, బీజేపీ ఫ్లోర్ లీడర్ గంకల కవిత అప్పారావు కొండవాలు ప్రాంతంలో పర్యటించి, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్లు, కాలువలు, మెట్లు నిర్మాణం, 24x7 పనుల వల్ల ఏర్పడిన గుంతల పూడ్చివేత, మరియు వెలగని వీధి దీపాల సమస్యలను పరిష్కరించాలని స్థానికులు కోరారు. ఈ సమస్యలపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు.







































