కోర్టులో పురుగు మందు తాగి కుప్పకూలిన వ్యక్తి

315చూసినవారు
కోర్టులో పురుగు మందు తాగి కుప్పకూలిన వ్యక్తి
విశాఖ జిల్లా కోర్టులో సోమవారం ఉదయం ఒక వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఎల్లమ్మ తోటకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి, కోర్టు కార్యక్రమాలు ప్రారంభం కాగానే న్యాయమూర్తి ముందు బల్లపై ఒక లేఖ పెట్టి, పురుగు మందు తాగి కుప్పకూలిపోయాడు. అతన్ని వెంటనే కేజీహెచ్‌కు తరలించారు. అతను కోర్టుకు ఎందుకు వచ్చాడు, లేఖలో ఏమి రాశాడనే వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్