ఎలమంచిలి పాత జాతీయ రహదారిపై కొత్తూరు వద్ద ఆదివారం సాయంత్రం భారీ ట్రక్కు బోల్తా పడింది. రాంబిల్లి నావికాదళ ప్రాంతానికి భారీ రాళ్లను తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో ఇతర వాహనాలు లేకపోవడం, డ్రైవర్ చాకచక్యంతో పెద్ద ప్రమాదం తప్పింది. డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డారు. పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరిస్తూ సహాయక చర్యలు చేపట్టారు.