ఎస్ రాయవరం ప్రభుత్వ ఉపాధ్యాయురాలు బాల తన మొదటి నెల జీతం నుండి కొంత మొత్తాన్ని గిరిజన విద్యార్థుల అభ్యసన సామాగ్రి కోసం విరాళంగా అందించారు. ఈ విరాళం చెక్కును సోమవారం ఎస్ రాయవరం PRTU మండల శాఖ అధ్యక్షుడు బాలు, సమన్వయకర్త సత్యనారాయణ, మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావుకు అందజేశారు. అల్లూరి జిల్లాలో గిరిజన విద్యార్థులకు PRTU ఏడాది నుంచి అభ్యసన సామగ్రిని పంపిణీ చేస్తున్న విషయం తెలుసుకొని, ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. గుడికి ఇవ్వాలనుకున్న నగదును పేద విద్యార్థులకు విరాళంగా ఇవ్వడం ఆనందంగా ఉందని ఆమె తెలిపారు.