ఎలమంచిలిలో RTC బస్సు ఢీకొని యువకుడు మృతి

1832చూసినవారు
ఎలమంచిలిలో RTC బస్సు ఢీకొని యువకుడు మృతి
ఎలమంచిలి మండలం పురుషోత్తపురం వద్ద జాతీయ రహదారిపై బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్తున్న లగ్జరీ RTC బస్సు రోడ్డు దాటుతున్న స్కూటీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో మడక నూకరాజు (35) అనే యువకుడు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై ఎలమంచిలి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్