డుంబ్రిగుడ మండలం అరకు పీనరీలో ప్లాస్టిక్ వాడకాన్ని అరికట్టేందుకు అటవీశాఖ కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. పర్యాటకులు లోపలికి తీసుకెళ్లే ప్రతి ప్లాస్టిక్ బాటిల్ లేదా కవర్‌కు రూ. 20 డిపాజిట్ తీసుకొని స్టిక్కర్ అంటిస్తున్నారు. తిరిగి వెళ్లేటప్పుడు ఆ స్టిక్కర్ ఉన్న బాటిల్‌ను చూపించిన వారికి మాత్రమే డిపాజిట్ తిరిగి ఇస్తున్నారు. ప్లాస్టిక్ రహిత పీనరీని సాధించడమే ఈ నిబంధనల లక్ష్యమని సిబ్బంది తెలిపారు.