అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ముంచంగిపుట్టు మండలంలో శనివారం సంతలో భారీ వర్షం కురిసింది. ఎండగా ఉన్న సమయంలో ఒక్కసారిగా మేఘాలు కమ్ముకొని కురిసిన వర్షంతో సంతలో ప్రజలు, వాహనాలు నిలిచిపోయాయి. కూరగాయలు అమ్ముకునేవారు బురదలో ఇబ్బందులు పడ్డారు. వర్షం కారణంగా సంత కళ తప్పింది.