
అల్లూరి జిల్లాలో వింత..!
అల్లూరి జిల్లా ఎం.భీమవరం పంచాయతీ కొత్తూరులో వింత ఘటన వెలుగులోకి వచ్చింది. నాగేశ్వరావు అనే రైతు సాగు చేస్తున్న మొక్కజొన్నకు 16 పొత్తులు వచ్చి అబ్బురపరుస్తున్నాయి. ఈ మొక్కను చుట్టు పక్కల వారు వింతగా చూస్తున్నారు. గతంలో ఎప్పుడూ ఇన్ని పొత్తులు చూడలేదని.. రెండు లేదా మూడు మాత్రమే వచ్చేవని చెప్పారు. విత్తనంలో జన్యు పరమైన లోపంతో ఇలా వస్తాయని హార్టికల్చర్ అధికారులు అంటున్నారు.







































