రాజవొమ్మంగి జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు జిల్లా స్థాయి క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. శుక్రవారం రంపచోడవరంలో జరిగిన అండర్-17 కబడ్డీ పోటీల్లో వీరు ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయికి అర్హత సాధించారు. కబడ్డీలో సందీప్ కుమార్, మౌని దుర్గాప్రసాద్, లాంగ్ జంప్ లో దుర్గ తేజ జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైనట్లు వ్యాయామ ఉపాధ్యాయురాలు రేష్మ తెలిపారు.