పాడేరు - Paderu

వాసవి క్లబ్ అధ్యక్షులు రామకృష్ణ పాడేరులో పలు కార్యక్రమాల్లో పాల్గొని, మహిళలకు చీరలు, అన్నదానానికి సరుకులు పంపిణీ

ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ, గుడ్ విల్ విజిట్స్ లో భాగంగా బుధవారం ఏఎస్ఆర్ జిల్లా పాడేరులో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వాసవి క్లబ్ పాడేరు హిల్స్, వాసవి క్లబ్ పాడేరు, వనిత క్లబ్, వనిత మొద మాంబ పాడేరు ఆధ్వర్యంలో శ్రీ మోదకొండమ్మ అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలో మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అమ్మవారి ఆలయంలో అన్నదాన కమిటీకి బియ్యం, నిత్యవసర సరుకులు అందజేశారు. జూనియర్ కాలేజీ ఆవరణలో సరస్వతి దేవి, మహాత్మా గాంధీ, సర్వేపల్లి రాధాకృష్ణ, డొక్కా సీతమ్మ విగ్రహాలను ఆవిష్కరించారు.

వీడియోలు


కొమరంభీం జిల్లా