AP: హిందూపురంలో ఆదివారం పర్యటించిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా హిందూపురం ప్రజలకు నందమూరి కుటుంబం రుణపడి ఉందని, తన తండ్రి, అన్న తర్వాత తనను వరుసగా గెలిపించారని గుర్తుచేశారు. హిందూపురం చరిత్రను తిరగరాయగల సామర్థ్యం నందమూరి కుటుంబానికే ఉందన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా పనిచేస్తానని హామీ ఇస్తూ, కొత్త కంపెనీలను తీసుకురావడంతో పాటు నిరుద్యోగులకు అండగా ఉంటానని తెలిపారు.