AP: దృష్టి లోపం ఉన్న దివ్యాంగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మంత్రి లోకేశ్ చొరవతో దృష్టిలోపం ఉన్నవారికి ఎంపీసీ, బైపీసీ కోర్సుల్లో చదవడానికి వీలు కల్పిస్తూ కళాశాల విద్యాశాఖ జీవో జారీ చేసింది. దివ్యాంగుల కోరిక మేరకు సైన్స్ కోర్సుల్లో వారికి అవకాశం కల్పించాలని మంత్రి లోకేశ్ అధికారులను ఆదేశించారు. ప్రాక్టికల్స్‌కు దివ్యాంగులు హాజరవ్వడం కష్టం కావడంతో.. లఘురూప ప్రశ్నలతో ఎసెస్‌మెంట్ చేయాలని మంత్రి సూచించారు.