విటమిన్ డీ లోపంతో యువతలో పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు

4705చూసినవారు
విటమిన్ డీ లోపంతో యువతలో పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు
మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల యువత, సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లో విటమిన్ డీ లోపం తీవ్రమవుతోందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎముకల ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తికి కీలకమైన ఈ ‘సన్‌షైన్ విటమిన్’ లోపం వల్ల అలసట, కండరాల బలహీనత, తరచుగా ఇన్ఫెక్షన్లు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. గంటల తరబడి ఏసీ గదుల్లో ఉండటం, ఎండ తగలకపోవడం దీనికి ప్రధాన కారణాలు. సూర్యరశ్మి, పాల ఉత్పత్తులు, గుడ్డు పచ్చసొన, పుట్టగొడుగులు, ఫ్యాటీ ఫిష్ వంటి ఆహారాల ద్వారా విటమిన్ డీ పొందవచ్చుని వివరిస్తున్నారు

సంబంధిత పోస్ట్