శరీరానికి విటమిన్ లు అత్యవసర పోషకాలు. ఇవి శక్తినివ్వడం, రోగనిరోధక శక్తిని పెంచడం, అవయవాల పనితీరును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. విటమిన్ సి, డి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. విటమిన్ డి, బి12 ఎముకలు, కండరాలను బలపరుస్తాయి. విటమిన్ ఎ, ఇ కంటి, చర్మ ఆరోగ్యానికి అవసరం. విటమిన్ బి6, బి12 గుండె, మెదడు ఆరోగ్యానికి తోడ్పడతాయి. విటమిన్ లోపాలను రక్త పరీక్షల ద్వారా గుర్తించవచ్చు. అలసట, జుట్టు రాలడం వంటివి లోపానికి సంకేతాలు. సమతుల్య ఆహారం, ఎండలో తిరగడం ద్వారా లోపాలను అధిగమించవచ్చు.