AP: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్ భార్య ధనలక్ష్మి బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భర్త, మాజీ సీఎం జగన్, ఎంపీ అవినాష్రెడ్డిలను ఎదిరించేంత ధైర్యం చేయగలడా అని, తమను, తమ బిడ్డను చంపితే ఏం చేస్తాడో చూస్తామని గుర్తు తెలియని వ్యక్తి బెదిరించాడని ఆమె ఆరోపించారు. తననేమీ చేయలేక కుటుంబసభ్యులను బెదిరించడం సిగ్గుచేటని సునీల్ యాదవ్ అన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.