AP: హైదరాబాద్‌లో మాజీ మంత్రి వివేకా హత్య కేసులో గంగిరెడ్డి విచారణ రెండో రోజు కొనసాగింది. గంగిరెడ్డిని మంగళవారం 8 గంటల పాటు ఈడీ విచారించింది. భారీగా మనీలాండరింగ్ జరిగిందని ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. గంగిరెడ్డి ఆర్థిక లావాదేవీలపై బ్యాంకు ఖాతాలు పరిశీలించారు. వివేకా హత్య కేసులో డబ్బులు ఎవరు సమకూర్చారనే కోణంలో ఈడీ విచారించింది.