AP: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఆయన కుమార్తె సునీత నర్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై నాంపల్లి సీబీఐ కోర్టు తీర్పును రిజర్వు చేసింది. దర్యాప్తు కొనసాగించాలని కోరుతూ సునీత దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. ఇరుపక్షాల వాదనలు విన్న నాంపల్లి సీబీఐ కోర్టు తీర్పును రిజర్వు చేసింది. ఈ తీర్పు వివేకా హత్య కేసు దర్యాప్తులో కీలక మలుపు కానుంది. తీర్పు ఎప్పుడనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.