
దక్షిణ విశాఖ
విశాఖపట్నం: పేకాట ఆడుతూ దొరికిన మహిళలు
విశాఖపట్నం రైల్వే న్యూ కాలనీ పోలాక్ స్కూల్ సమీపంలో మంగళవారం రాత్రి సిటీ టాస్క్ఫోర్స్ అధికారులు పేకాట స్థావరంపై మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో నలుగురు మహిళలు, నలుగురు పురుషులతో సహా మొత్తం 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.30,210 నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను, నగదును తదుపరి చర్యల కోసం 4వ టౌన్ పోలీస్ స్టేషన్కు అప్పగించారు.

































