వైజాగ్ కైలాసగిరిలో నిర్మించిన అత్యాధునిక 50 మీటర్ల గ్లాస్ బ్రిడ్జ్ డిసెంబర్ 1 నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుంది. దేశంలోనే అతి పొడవైన ఈ వంతెన, కేరళ 40 మీటర్ల రికార్డును బ్రేక్ చేసింది. రూ.7 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఈ వంతెన, పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించనుంది. రాత్రివేళల్లో విద్యుత్ దీపాలతో మెరిసిపోయే ఈ బ్రిడ్జి గంటకు 250 కి.మీ. వేగంతో గాలులను తట్టుకోగలదు. భద్రతా కారణాల దృష్ట్యా ఒకేసారి 40 మందికి అనుమతి.