
అనకాపల్లి జిల్లాలో ఘనంగా 11వ విడత "మొబైల్ రికవరీ మేళా
అనకాపల్లి జిల్లా పోలీస్ శాఖ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రజల ఆస్తుల రక్షణకు కృషి చేస్తోంది. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో 11వ విడత 'మొబైల్ రికవరీ మేళా' నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హ పాల్గొని, గత 2-3 నెలల్లో రికవరీ చేసిన 750 మొబైల్ ఫోన్లను (సుమారు రూ. 1.50 కోట్ల విలువైనవి) బాధితులకు అందజేశారు. జిల్లాలో ఐటీ కోర్ టీమ్ నిరంతర కృషిని ఎస్పీ అభినందించారు.







































