అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2019లో జరిగిన వరుస దొంగతనాల కేసులో నిందితుడికి న్యాయస్థానం 18 నెలల సాధారణ జైలు శిక్ష విధించింది. శాస్త్రీయ ఆధారాలతో దర్యాప్తు చేసి, నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన అధికారులను జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా అభినందించారు. అనకాపల్లి XI అదనపు జుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ న్యాయమూర్తి ఏ. రమేష్ బుధవారం ఈ తీర్పు వెల్లడించారు. ప్రధాన నిందితుడు తాటిపూడి పాత నేరస్తుడని, అతనిపై మోపబడిన అభియోగాలు రుజువైనట్లు నిర్ధారించారు.