సమృద్ధిగా అన‌కాప‌ల్లి జిల్లాలో ఇంధన నిల్వలు

4చూసినవారు
సమృద్ధిగా అన‌కాప‌ల్లి జిల్లాలో ఇంధన నిల్వలు
అనకాపల్లి జిల్లాలో ఇంధన సరఫరా సమృద్ధిగా ఉందని కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. పెట్రోల్ బంక్‌లపై ప్రత్యేక బృందాలు నిరంతరం తనిఖీలు చేపడుతున్నాయి. కృత్రిమ కొరత సృష్టించినా, బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తుహిన్ సిన్హా హెచ్చరించారు. ప్రజలు తప్పుడు ప్రచారాలను నమ్మకుండా, అవసరానికి మించి ఇంధనం నిల్వ చేసుకోవద్దని సూచించారు. జిల్లాలో ఇంధన లభ్యతపై ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు భరోసా ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్