మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయనకు ఘన నివాళులు అర్పించారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు, అదనపు ఎస్పీ ఎల్. మోహన రావు ఆధ్వర్యంలో అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ధీశాలి అల్లూరి అని, గిరిజన హక్కుల పోరాటంలో ఆయన చూపిన ధైర్యం చిరస్మరణీయమని అదనపు ఎస్పీ మోహన రావు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొని అల్లూరి ఆశయ సాధనకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.