అన‌కాప‌ల్లి: అదరగొట్టిన మహిళా కానిస్టేబుల్

2చూసినవారు
అన‌కాప‌ల్లి: అదరగొట్టిన మహిళా కానిస్టేబుల్
అనకాపల్లి జిల్లా పోలీస్ స్పోర్ట్స్ మీట్ - 2025లో ఏఆర్ మహిళా కానిస్టేబుల్ లింగేటి పావని కుమారి అసాధారణ ప్రతిభ కనబరిచారు. పరుగు పందెం, లాంగ్ జంప్, షాట్‌పుట్ సహా మొత్తం 7 విభాగాల్లో పతకాలు సాధించి "మహిళల ఆల్ రౌండ్ ఇండివిడ్యువల్ ఛాంపియన్షిప్" కైవసం చేసుకున్నారు. పావని కుమారి సాధించిన ఈ ఘనతను విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి, అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ప్రత్యేకంగా అభినందించారు. గతంలో జాతీయ స్థాయి పోటీల్లోనూ సత్తా చాటిన ఆమె విజయం తోటి సిబ్బందికి స్ఫూర్తిదాయకమని పోలీస్ ఉన్నతాధికారులు కొనియాడారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you