అనకాపల్లి : రూ.30 లక్షల విలువ చేసే నేరేడు తోట నరికివేత

71చూసినవారు
అనకాపల్లి : రూ.30 లక్షల విలువ చేసే నేరేడు తోట నరికివేత
అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో 4 ఎకరాల్లోని 40 నేరేడు చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు అక్రమంగా నరికి దొంగిలించుకుపోయారు. గొట్టివాడ గ్రామంలోని సర్వే నంబర్ 16లోని సూరపురాజు చెరువు పరిధిలో ఈ చెట్లు ఉన్నాయి. నరికేసిన చెట్ల విలువ దాదాపు రూ.30 లక్షలుంటుందని బాధితులు వాపోతున్నారు. ఈ విషయంపై సబ్బవరం తహసీల్దార్, జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్