అనకాపల్లిలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించి అద్భుత ప్రతిభ కనబరిచారు. పరీక్ష రాసిన 31 మంది విద్యార్థులూ పాసయ్యారు. వీరిలో 13 మంది 500కు పైగా మార్కులు సాధించారు. ఎస్. రేవంత్ 574, బి. చిరు 561, కె. అభిలాష్ మణికంఠ 540 మార్కులతో అగ్రస్థానంలో నిలిచారు. పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జోశ్యుల ఉష ఈ విషయాన్ని తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను పాఠశాల కమిటీ చైర్మన్ గొర్లె నాయుడు, అధ్యాపక బృందం అభినందించారు.