విశాఖపట్నం చినవాల్తేరు పట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనకాపల్లి శ్రీ నూకాలమ్మ ఆలయంలో ఆదివారం మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఆలయానికి వచ్చిన భక్తులకు చల్లని మజ్జిగను అందజేశారు. 'సేవే మాధవసేవ' అన్న భావంతో ఫౌండేషన్ సమాజ సేవలో కొనసాగుతోందని అధ్యక్షుడు పట్టా రమేష్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.