అనకాపల్లి: ఎంవీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ప్రముఖులు

4చూసినవారు
అనకాపల్లి: ఎంవీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ప్రముఖులు
ప్రముఖ పారిశ్రామికవేత్త, బీజేపీ నాయకుడు, ఎంవీఆర్ ట్రస్ట్ అధినేత ముత్యాల వెంకటేశ్వరరావు (ఎంవీఆర్)ను మంగళవారం అనకాపల్లిలోని ఆయన కార్యాలయంలో పలువురు రాజకీయ, పారిశ్రామిక, కార్మిక సంఘాల నాయకులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా నక్కపల్లి మిట్టల్ స్టీల్ కంపెనీ సీఈఓ పార్థసారథి, ఐఎన్‌టీయూసీ నాయకుడు ధర్మాల వ్యాసశర్మ, ఏఐబీఎఫ్ రాష్ట్ర సమన్వయకర్త వీసం నాగేశ్వరరావు, టీడీపీ సీనియర్ నాయకుడు చామర్తి శంకర్ తదితరులు ఎంవీఆర్‌ను సత్కరించి అభినందనలు తెలిపారు. అనుచరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్