అనకాపల్లి: టెక్స్‌టైల్ రంగానికి కేంద్రం ప్రోత్సాహం

2చూసినవారు
అనకాపల్లి: టెక్స్‌టైల్ రంగానికి కేంద్రం ప్రోత్సాహం
కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ శనివారం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని బ్రాండిక్స్ సంస్థను సందర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో టెక్స్‌టైల్ రంగానికి అపార అవకాశాలున్నాయని, మరిన్ని పరిశ్రమలు వస్తే ఉపాధి పెరుగుతుందని ఆయన అన్నారు. ప్రతి కోటి రూపాయల పెట్టుబడికి 50 మందికి ఉపాధి లభిస్తుందని, టెక్నికల్ టెక్స్‌టైల్స్ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి కీలకం అవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ విజయ కృష్ణన్, జౌళి శాఖ అధికారులు, బ్రాండిక్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్