అనకాపల్లి: నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న చాగంటి

5చూసినవారు
అనకాపల్లి: నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న చాగంటి
అనకాపల్లి గవరపాలెంలో కొలువైయున్న ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ నూకాంబిక అమ్మవారిని ఆధ్యాత్మిక ప్రవచనకర్త, ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు బుధవారం దర్శించుకున్నారు. కొత్త అమావాస్య రాష్ట్ర జాతర మహోత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన చాగంటికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే కొణతాల ఆయనను అమ్మవారి చిత్రపటం, ప్రసాదంతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ పీలా నాగశ్రీను, సహాయ కమిషనర్ శ్రీధర్, ఆలయ ధర్మకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్