అనకాపల్లి: పరిశ్రమల్లో భద్రతా తనిఖీలు చేపట్టండి

492చూసినవారు
అనకాపల్లి: పరిశ్రమల్లో భద్రతా తనిఖీలు చేపట్టండి
అనకాపల్లి జిల్లాలో పెరుగుతున్న ఎండలు, వడగాల్పుల నేపథ్యంలో పారిశ్రామిక ప్రమాదాల నివారణకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ శౌర్య మాన్ పటేల్‌తో కలిసి పరిశ్రమల భద్రతపై ఆమె సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా కెమికల్, ఫార్మా, గ్యాస్ ఆధారిత పరిశ్రమల్లో ప్రత్యేక భద్రతా తనిఖీలు చేపట్టాలని ఆడిట్ బృందాలను ఆదేశించారు. వేసవిలో అగ్నిప్రమాదాల ముప్పు ఎక్కువని, ఫైర్ సేఫ్టీ సిస్టమ్స్, అత్యవసర వైద్య సేవలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్