అనకాపల్లి: బాణసంచా క్షతగాత్రులను పరామర్శించిన సీపీఎం బృందం

51చూసినవారు
బాణసంచా ప్రమాదంలో క్షతగాత్రులై విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులను సోమవారం సీపీఎం కేంద్రం కమిటీ సభ్యులు కె. లోకనాధం, అనకాపల్లి జిల్లా కార్యదర్శి జి. కోటేశ్వరరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం. అప్పలరాజులు పరామర్శించారు. ఈ సందర్భంగా కె. లోకనాధం మాట్లాడుతూ, క్షతగాత్రులు హాస్పటల్లో జాయిన్‌ అయిన తరువాత వారిని పట్టించుకొనే నాధులే కరువయ్యారని సమాచారం. మరణించిన కార్మికుల కుటుంబాలకు కోటి రూపాయలు పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కోసం డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్