అనకాపల్లి: సినీ నటుడు ప్రకాష్ రాజ్‌పై చర్యలకు డిమాండ్‌

563చూసినవారు
అనకాపల్లి: సినీ నటుడు ప్రకాష్ రాజ్‌పై చర్యలకు డిమాండ్‌
శ్రీరామచంద్రునిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో సినీ నటుడు ప్రకాష్ రాజ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కొండకొప్పాక శ్రీ రాధాకృష్ణ దేవస్థాన అధ్యక్షులు దాడి వీరునాయుడు (కృష్ణస్వామి) డిమాండ్ చేశారు. అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తూ, ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు హిందువుల మత విశ్వాసాలను, మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆయన మండిపడ్డారు. తరచూ శ్రీరాముని అవమానిస్తూ, ఆయనను ఒక ప్రాంతానికి పరిమితం చేసి చులకన చేయడం సమాజంలో మత సామరస్యానికి, శాంతిభద్రతలకు ముప్పు అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్