అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్, జిల్లాలోని విద్యాసంస్థలు, హాస్టళ్లను ‘నెట్ జీరో హెల్తీ క్యాంపస్’లుగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్ నియంత్రణ, పచ్చదనం పెంపునకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. క్యాంపస్‌లలో రైన్ వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేసి, హాస్టళ్ల నుండి వచ్చే నీటిని మొక్కలకు మళ్లించి పునర్వినియోగం చేయాలని స్పష్టం చేశారు. విద్యార్థులకు ఆరోగ్యకరమైన, పర్యావరణ హితమైన వాతావరణం కల్పించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆమె దిశానిర్దేశం చేశారు.