అన‌కాప‌ల్లి: కేంద్రియ విద్యాలయ పనులకు గ్రీన్ సిగ్నల్

1చూసినవారు
అనకాపల్లి రూరల్ మండలం అచ్చయ్యపేటలో కేంద్రీయ విద్యాలయం కోసం కేటాయించిన 10 ఎకరాల భూమిని ఎంపీ సీఎం రమేష్ బుధవారం పరిశీలించారు. అధికారులతో ఫోన్లో మాట్లాడి, నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. 2026–27 విద్యా సంవత్సరం నుంచే 1 నుండి 5వ తరగతి వరకు సీబీఎస్ఈ విధానంలో తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఈ ప్రతిష్టాత్మక విద్యాసంస్థ నియోజకవర్గానికి రావడం చారిత్రాత్మకమని పేర్కొన్న ఎంపీ, పనులను తానే స్వయంగా పర్యవేక్షిస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్