అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం గొడిచెర్ల గ్రామంలో ప్రజలు అస్వస్థతకు గురైన ఘటనపై రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. సింగపూర్ పర్యటనలో ఉన్న మంత్రి, అక్కడి నుంచే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, గ్రామంలో తక్షణమే మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే, గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపట్టి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.