అనకాపల్లి;కాశీబుగ్గలో భక్తులు మృతి చెందడం అత్యంత బాధాకరం

2చూసినవారు
అనకాపల్లి;కాశీబుగ్గలో భక్తులు మృతి చెందడం అత్యంత బాధాకరం
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో కార్తీక ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో భక్తులు మృతి చెందడంపై అనకాపల్లి ఎంపీ సి. ఎం. రమేష్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శనివారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి తక్షణ వైద్యం అందించాలని అధికారులను కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల ఆర్థిక సహాయం ప్రకటించారని తెలిపారు.
Job Suitcase

Jobs near you