అనకాపల్లిలో శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆధ్వర్యంలో వైశాఖ శుద్ధ దశమి సందర్భంగా అమ్మవారి జన్మదినోత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి వెండి రథంపై ఊరేగింపు నిర్వహించారు. నామసంకీర్తనలతో తిరువీధి మహోత్సవం వైభవంగా సాగింది. గోపూజ, అభిషేకాలు, అర్చనలు నిర్వహించగా, భక్తులు బియ్యాభిషేకం, లక్ష మల్లెపూలతో అర్చనలు చేశారు. మహిళలు లలిత సహస్రనామ పారాయణంలో పాల్గొన్నారు. అనంతరం అన్నసమారాధన నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.