అనకాపల్లి జిల్లా రావికమతం(M) దొండపూడి గ్రామానికి చెందిన గట్రెడ్డి సంతోషి గ్రూప్ -1లో ఫలితాల్లో సత్తా చాటారు. మంగళవారం విడుదలైన గ్రూప్-2 ఫలితాల్లో సంతోషి సాధారణ పరిపాలన శాఖలో ఏఎస్ఓగా ఎంపిక కాగా శుక్రవారం రాత్రి విడుదలైన గ్రూప్ -1 ఫలితాల్లో రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ (RTO)గా ఎంపికైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె మాకవరపాలెం రెవెన్యూ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు.