ఆదాని గ్రూప్ చైర్మన్ గౌతమ్ ఆదాని ఆదివారం కడప జిల్లాలో పర్యటించి, గండికోట, చిత్రావతి, కొప్పోలు ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న పంప్డ్ స్టోరేజ్ హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టులను పరిశీలించారు. అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సి. యం. రమేష్ ఆయనతో కలసి ప్రాజెక్టులను సందర్శించారు. ఈ ప్రాజెక్టులు ప్రాంతీయ అభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పన, విద్యుత్ రంగ బలోపేతానికి దోహదం చేస్తాయని ఎంపీ తెలిపారు. ఈ మేరకు ఆదివారం రాత్రి ఎంపీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.