నూతన సంవత్సరం సందర్భంగా, గురువారం స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడి నివాసంలో రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్, అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సి. ఎం రమేష్ మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. స్పీకర్‌కు పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించారు. అనకాపల్లి జిల్లా అభివృద్ధి, ప్రజాసంక్షేమ కార్యక్రమాలు, రానున్న కాలంలో చేపట్టాల్సిన కీలక ప్రాజెక్టులపై ఇరువురు నేతలు చర్చించారు. అనంతరం స్పీకర్ ఏర్పాటు చేసిన విందులో ఎంపీ సి. ఎం రమేష్ పాల్గొన్నారు.