అనకాపల్లి: మహిళల భద్రతకు ‘ఆపరేషన్ దండాయన’

8చూసినవారు
అనకాపల్లి: మహిళల భద్రతకు ‘ఆపరేషన్ దండాయన’
మహిళలు, బాలికల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అనకాపల్లి జిల్లా పోలీస్ శాఖ 'ఆపరేషన్ దండాయన'ను అమలు చేస్తోంది. మహిళలపై నేరాల విషయంలో జీరో టాలరెన్స్ విధానం పాటిస్తూ, ప్రతి కేసులో 60 రోజుల్లోగా చార్జిషీట్ దాఖలు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. పునరావృత నేరస్తులపై నిఘా, బాధితులకు కౌన్సిలింగ్, న్యాయ సహాయం అందిస్తున్నామని, 2024 నుంచి ఇప్పటివరకు మహిళలపై నేరాలకు సంబంధించిన 28 కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you