ఈ నెల 27, 28 తేదీల్లో అనకాపల్లిలో జరగనున్న
టీడీపీ మహానాడు–2026 కోసం మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జి పీలా గోవింద సత్యనారాయణ మంగళవారం ఏర్పాట్లను పరిశీలించారు. పట్టణంలోని ఐదు క్లస్టర్ల పరిధిలోని ఫంక్షన్ హాళ్లు, కళ్యాణ మండపాల్లో ప్రతినిధుల వసతి, ఇతర ఏర్పాట్లను ఆయన తనిఖీ చేశారు. నియోజకవర్గ పరిశీలకురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి, రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ల సురేంద్రతో కలిసి ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో
టీడీపీ నాయకులు, కార్యకర్తలు, క్లస్టర్, యూనిట్, బూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.