అనకాపల్లి: లబ్ధిదారుల ఇంటికే పింఛన్

2చూసినవారు
అనకాపల్లి: లబ్ధిదారుల ఇంటికే పింఛన్
అనకాపల్లి జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ప్రక్రియ బుధవారం ఉదయం వేగంగా ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ 84వ వార్డు పెరుగు బజారులో పర్యటించి, స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేశారు. జిల్లావ్యాప్తంగా 2.53 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు రూ.107.75 కోట్లను పంపిణీ చేస్తున్నామని, వంద శాతం పంపిణీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తెల్లవారుజామున 5 గంటల నుంచే సిబ్బంది క్షేత్రస్థాయిలో పని చేస్తున్నారని, ఎక్కడా జాప్యం లేకుండా పారదర్శకంగా పింఛన్లు అందజేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పీడీ శచీదేవి, జీవీఎంసీ కమిషనర్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్