అనకాపల్లి: 27నకలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్

778చూసినవారు
అనకాపల్లి: 27నకలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్
అనకాపల్లి కలెక్టరేట్ సమావేశ మందిరంతో పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని మండల, డివిజన్ స్థాయి కార్యాలయాల్లో సోమవారం (ఏప్రిల్ 27) ఉదయం 10 గంటలకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదివారం తెలిపారు. పీజీఆర్ఎస్‌లో సమర్పించిన అర్జీల స్థితిగతులను తెలుసుకోవడానికి 1100 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని అర్జీదారులకు సూచించారు. కార్యక్రమానికి హాజరు కాలేని వారు మీకోసం. ఏపీ. జీఓవీ. ఇన్‌ వెబ్‌సైట్ ద్వారా కూడా అర్జీలు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్