అనకాపల్లి: ఘనంగా పీవీ నరసింహారావు జయంతి వేడుకలు

540చూసినవారు
అనకాపల్లి: ఘనంగా పీవీ నరసింహారావు జయంతి వేడుకలు
అనకాపల్లి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహారావు 105వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంఘం ప్రతినిధులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బ్రాహ్మణ సంఘం సెక్రటరీ విశ్వనాథం మాట్లాడుతూ, పీవీ నరసింహారావు అపర చాణక్యుడని, ఆయన తెచ్చిన సంస్కరణలే దేశాన్ని ప్రగతి పథంలో నిలిపాయని కొనియాడారు. పీవీ జయంతి వేడుకలను ప్రతి ఏటా ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పేరూరి భోగలింగం, పాండురంగారావు, శ్యామ్ కుమార్, ఫణి కుమార్, సోమశేఖర్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్