అనకాపల్లిలోని 82వ వార్డును యథావిధిగా కొనసాగించాలని కోరుతూ విజయరామరాజుపేట గ్రామ కమిటీ ప్రతినిధులు స్థానిక ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణను కలిసి వినతిపత్రం అందజేశారు. వార్డు పునర్విభజన నేపథ్యంలో ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని వారు కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ, జీవీఎంసీ వార్డుల సంఖ్య 150కు పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు సూచించిన అంశాలను పరిశీలించి, అన్ని వర్గాలతో చర్చించిన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే సానుకూల స్పందనతో గ్రామ కమిటీ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు ఆళ్ల శివరాం సత్యనారాయణ పాల్గొన్నారు.