అనకాపల్లి జిల్లాలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు తగ్గించి, ట్రాఫిక్ క్రమబద్ధీకరణను బలోపేతం చేసేందుకు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా నేతృత్వంలో అధికారులు బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జాతీయ రహదారి పరిధిలోని 11 పోలీస్ స్టేషన్లకు రోడ్ సేఫ్టీ రైట్ గేర్ ఎక్విప్మెంట్ అందించడంపై చర్చించారు. ట్రాఫిక్ భద్రతా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు అవసరమైన కీలక సామగ్రిని త్వరగా అందించాలని అధికారులు అంగీకరించారు.